Homeఆంధ్రప్రదేశ్PM Modi: 'శభాష్‌.. ఇదే వేగంతో దూసుకెళ్లు'- మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టిన ప్ర‌ధాని...

PM Modi: ‘శభాష్‌.. ఇదే వేగంతో దూసుకెళ్లు’- మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టిన ప్ర‌ధాని మోదీ

PM Modi Appreciates Nara Lokesh: భోగాపురం అంతర్జాతీయ విమానశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, అంంకిత భావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం అనంతరం.. వేదికపైనే పవన్‌ను దగ్గరకు పిలిచి మోదీ అభినందించిన విషయం తెలిసిందే. అదేవిధంగా మంత్రి నారా లోకేశ్‌ను సైతం మోదీ మెచ్చుకున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. 

- Advertisement -

`నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శభాష్‌..లోకేష్‌` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.. రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు. భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం చేసిన అనంత‌రం బ‌య‌లుదేరిన ప్ర‌ధానికి నారా లోకేష్ వీడ్కోలు ప‌లికారు. 

ఈ సందర్భంగా ఆప్యాయంగా భుజం త‌ట్టిన ప్ర‌ధాని.. బాగా ప‌నిచేస్తున్నావు.. ఇదే వేగం, స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని సూచించారు. గ‌తంలోనూ ఏపీలో ప్ర‌ధాని మోదీ పాల్గొన్న కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం చేయ‌డం, యోగాంధ్ర రికార్డు సాధ‌నలో కీల‌క పాత్ర పోషించిన లోకేష్ కృషిని అప్ప‌ట్లో ప్ర‌ధాని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News