Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పోలీసులు షాక్

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకి పోలీసులు షాక్

Police Case Filed on Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటిపై 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈమేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ హాజరయ్యారు. దీంతో జగన్‌కు మద్దతుగా గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మీదుగా నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో రద్దీని నియంత్రించే చర్యల్లో భాగంగా కొర్రపాడు శివారులోని పెట్రోల్‌ బంకు వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. వాహనాలు ఆగిపోవడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి చేరుకుని వాహనాలు ఎందుకు ఆపారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డితో పాటు మరికొందరిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

మరోవైపు జగన్ పర్యటనలో భాగంగా వివాదాస్పద ప్లకార్డు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజ అనే యువకుడు వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించాడు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ప్రదర్శించారంటూ సత్తెనపల్లి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రవితేజను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే జగన్ రెంటపాళ్ల పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతేకాకుండా పోలీసులపై నేతలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. దీనిపై న్యాయసలహాలు తీసుకుని చట్టపరంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News