Monday, March 31, 2025
Homeఆంధ్రప్రదేశ్BR Naidu: టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు

BR Naidu: టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు

టీటీడీ(TTD) చైర్మన్‌ బీఆర్‌ నాయుడు(BR Naidu)పై పోలీసులకు ఫిర్యాదు అందింది. కోర్టుల్లో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని లాయర్ ఇమ్మానేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఛానల్ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్, యాంకర్ శివపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

డిసెంబర్ 17న ఓ కార్యక్రమం ప్రసారం సందర్భంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ, న్యాయవాదుల అస్తిత్వాన్ని కించపరిచేలా విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రసారం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News