ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్(Jagan) ఇంటి ముందు గార్డెన్‌లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా వైసీపీ కార్యాలయానికి(YCP Ofiice) నోటీసులు పంపారు. వైసీపీ ఆఫీసు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా జగన్ నివాసానికి పక్కనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేది రాత్రి ఈ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో మంటలు వ్యాపించాయి. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీసీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు అందించారు.
ఇదిలా ఉంటే ఈ మంటలపై టీడీపీ వ్యంగ్యంగా స్పందించిన విషయం విధితమే. “సిట్ పడింది.. తగలబడింది”… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ సెటైర్లు వేసింది.