Homeఆంధ్రప్రదేశ్DSC allegations: డీఎస్సీ ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం

DSC allegations: డీఎస్సీ ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం

  • ఎమ్మెల్యే పార్థసారథి ను అడ్డుకున్న పోలీసులు
  • వెనక్కి తగ్గని వైసిపి
  • ఇరువురి కార్యాలయాల దగ్గర భారీగా మోహరించిన పోలీసులు

ఆదోని (తెలుగు ప్రభ): డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన రిలే దీక్షలు ప్రకంపనాలు లేపాయి. వైసీపీ ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నిరుద్యోగులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తే సహించేదిలేదని కూటమి బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్చరించారు. డీఎస్సీ నియామకాలు కూటమి ప్రభుత్వం పారదర్శంగా చేబడితే ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఏ అభ్యర్థికైన అన్యాయం జరిగిందని నిరూపిస్తే తాను కూడా వైసీపీ చేబట్టే రిలే దీక్షలకు సంపూర్ణ మద్దతు ఇవ్వటమే కాక ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. నిరాధారమైన ఆరోపణలు ప్రభుత్వంపై చేస్తే మాత్రం సహించేదిలేదని హెచ్చరించారు. డీఎస్సీ నియామకాలపై నాకు స్వష్టత ఉందని, మీకు నివృతి చేయడానికి తన కార్యాలయానికి సాయంత్రం 4 గంటల లోగా రావాలని, లేనిపక్షంలో నేను ఒక్కడినే సాయంత్రం 5 గంటలకు వైసీపీ కార్యాలయానికి వస్తున్నట్లు హుకుం జారీచేశారు. వైసీపీ కార్యాలయంలోనే మీరు ఎందరు వచ్చినా, నా పై దాడి చేసిన భయపడేది లేదంటూ, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధం అన్నారు. ఇదంతా రాజకీయంలో సర్వసాధారణ ఆరోపణలు అనుకున్న ప్రజలకు ఎమ్మెల్యే పార్థసారథి విలేకర్ల సమావేశంలో చెప్పినట్లుగానే సాయంత్రం 4 గంటల వరకు వైసీపీ చర్చలకు రాకపోవడంతో తానే వైసీపీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూస్తున్నామని సాయి ప్రసాద్ రెడ్డి అనడం విశేషం. రాజకీయంలో ప్రతిపక్షం సాధారణంగా ఆరోపణలు చేయడం సహజమని, ప్రజలను రెచ్చగొట్టేలా ఎమ్మెల్యే ప్రవర్తించడం సరికాదని వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అన్నారు.

- Advertisement -

Also read: Kolusu Parthasarathy: సీఎం పర్యటన విజయవంతంగా నిర్వహించాలి.. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు..

ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ కార్యాలయానికి కూటమి నాయకులు, కార్యకర్తలతో బయలుదేరడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో కూటమి కార్యకర్తలు గొడ్డలి పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఆర్ట్స్ కళాశాల రోడ్ వరకు వచ్చి పోలీసుల అడ్డగింపుతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల చాకచక్యంతో ఘర్షణలు జరగకుండా ఇరువైపు కార్యకర్తలను చెల్లాచెదురు ఈచేయడంతో సద్దుమణిగింది. పోలీసులు వైసిపి కార్యాలయం దగ్గర బారికేడ్లు అడ్డుపెట్టి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఇంటికి తరలించారు. ఆదోని రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ చూడలేదని ప్రజలు మాట్లాడుకోవడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News