AP Polycet results: ఏపీలో పాలిసెట్-2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 1,63,008 మంది పరీక్ష రాయగా వారిలో 1,48,950 మంది అర్హత సాధించినట్లు మంత్రి తెలిపారు. 91.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫలితాలను చూసుకోవడం ఎలా?: విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ polycetap.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన మిత్ర వాట్సప్ నంబరు 95523 00009 కు Hi మెసేజ్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్ ర్యాంకులే కీలకం కానున్నాయి. ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సైతం అధికారులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Also read-TDP: మహానాడు వేదిక, తేదీలు ఫిక్స్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు!

