Monday, March 31, 2025
Homeఆంధ్రప్రదేశ్Posani Krishna Murali | వైసీపీకి షాక్... అలీ బాటపట్టిన పోసాని

Posani Krishna Murali | వైసీపీకి షాక్… అలీ బాటపట్టిన పోసాని

ఏపీ లో వైసీపీ కి మరో షాక్ తగిలింది. రాజకీయాలకు నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali ) గుడ్‌బై చెప్పారు. “ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించను.. నన్ను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్‌ లాగే ప్రశ్నించా.. మంచి చేసే వాళ్లకి సపోర్ట్‌ చేశా. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా” అని అనూహ్య ప్రకటన చేశారు.

- Advertisement -

గతంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ కూడా ఓటమి తర్వాత ఆ పార్టీకే కాదు, రాజకీయాలకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన బాటలోనే పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) కూడా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆయనపై వరుసపెట్టి పోలీసు కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఐడీ లోను ఆయనపై కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, జనసేన నాయకులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెండు పార్టీల కార్యకర్తలు కడప, రాజంపేట, పత్తికొండ ఇలా అనేక పోలీస్ స్టేషన్లలో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. గత సెప్టెంబర్ లోనూ సీఎం మీడియా ఎదుట సీఎం చంద్రబాబుని కించపరిచేలా కామెంట్స్ చేశారని టీడీపీ లీడర్ బండారు వంశీకృష్ణ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసుల భయంతోనే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారని విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News