Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Praveen Prakash: మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ!

Praveen Prakash: మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ!

ఇంగ్లీష్ పై పట్టు పెంచేందుకు..

ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంలో ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడే టోఫెల్ పరీక్ష రాసే అవకాశాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు కల్పించనున్నామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఇంగ్లీష్ పై పట్టు పెంపొందించాలనే స్వప్నంతో మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణా తరగతులను నిర్వహించనుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు టోఫెల్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు చెప్పడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు బైజూస్ కంటెంట్ ట్యాబులను విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాల్లో టోఫెల్, బైజూస్ ట్యాబ్ కంటెంట్ ఒక భాగం కావాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News