Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్President: విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

President: విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

President Visakha Tour: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. నావల్‌ ఎయిర్‌ స్టేషన్ డేగాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమెకు ఘన స్వాగతం లభించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cabinet-meeting-on-february-23rd/

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి.. విశాఖ తీరంలో జరగనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026), మిలాన్ (MILAN) వేడుకల్లో పాల్గొననున్నారు. విశాఖలోని ఐఎన్‌ఎస్ దేగా విమానాశ్రయంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్-చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/ex-minister-errabelli-got-emotional-on-thorrur-municipality-lost/

ఫిబ్రవరి 18న సముద్ర తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అత్యంత అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని, యుద్ధనౌకలను వీక్షించనున్నారు. 19న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో కూడా పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నెల 20న ఐయాన్‌ కానైవ్‌ ఆఫ్‌ చీఫ్‌ కార్యక్రమం జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News