Friday, November 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Draupadi Murmu: ఈనెల 26న శ్రీశైల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu: ఈనెల 26న శ్రీశైల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ మధ్యే ఏపీలో పర్యటించిన ఆమె మూడు రోజుల పాటు జరిగిన పర్యటనలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. అనంతరం తిరుమలకి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. అయితే, ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 26వ తేదీన రాష్ట్రపతి శ్రీశైలం రాబోతున్నారు.

- Advertisement -

ఈ నెల 26న మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాద్ స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు. Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive కార్యక్రమాన్ని సంక్షిప్త రూపంలో ప్రసాద్‌ (P.R.A.S.A.D) అని పిలుస్తారు. కేంద్ర టూరిజం శాఖ 2014-15లో ఈ ప్రసాద్‌ స్కీమ్‌ను ప్రారంభించింది.

ఈ స్కీమ్ ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా.. శ్రీశైలం దేవస్థానం.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే శ్రీశైలం రూపురేఖలు మార్చేశారు.. కొత్త స్కీమ్‌ ద్వారా మరింత అభివృద్ధి చెందబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News