Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్President Draupadi murmu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi murmu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండవరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. డిసెంబర్ 4 రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ఆమెకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు డీజీ రవిశంకర్‌, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తొలిరోజు విజయవాడ, విశాఖపట్నంలలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. నేడు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

- Advertisement -

స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు వరాహ దర్శనం చేసుకున్న అనంతరం మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రాష్ట్రపతి తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు.

అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. తిరుపతికి చేరుకున్నారు. ఉదయం 11.35 గంటలకు అలిపిరిలోని గో మందిరాన్ని సందర్శించారు. 11 55 గంటలకు శ్రీ పద్మావతి యూనివర్శిటీలోని విద్యార్థినులతో ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.20గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 1.40 గంటలకు తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుండి ఢిల్లీకి పయనమవుతారు. ఈనెల 28న మళ్లీ తెలంగాణ పర్యటనకు రానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News