Saturday, November 15, 2025
HomeTop StoriesPM Modi: కర్నూలుకు చేరుకున్న ప్రధాని.. ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లిన మోదీ, చంద్రబాబు, పవన్‌

PM Modi: కర్నూలుకు చేరుకున్న ప్రధాని.. ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లిన మోదీ, చంద్రబాబు, పవన్‌

PM Modi AP Tour: ప్రధాని మోదీ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి మోదీ వెళ్తారు. మధ్యాహ్నం 12.05 గంటల వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉంటారు. మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నన్నూరుకు రానున్నారు.

- Advertisement -

శ్రీశైలం బయల్దేరిన మోదీ: కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ..హెలికాప్టర్‌లో శ్రీశైలం బయల్దేరారు. మోదీతో పాటుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also read:https://teluguprabha.net/andhra-pradesh-news/pm-modi-tweet-in-telugu-on-andhra-pradesh-tour/

జీఎస్టీ 2.0పై కర్నూలులో సభ: కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు పీఎం మోదీ ఏపీ వచ్చారు. ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో గురువారం జరిగే బహిరంగసభకు సుమారు మూడు లక్షల మంది హాజరవుతారని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు వేదిక కానుంది. ఇక్కడ సుమారు 450 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లుచేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల్లో 4భారీ టెంట్లు వేశారు. ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్రమోదీ రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad