అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ(PM Modi) ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుకున్న ఆయనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘుకృష్ణంరాజు, ఇతర కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుని అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
- Advertisement -
మరోవైపు అమరావతి ప్రాంతంలో పండుగ శోభ నెలకొంది. పునఃనిర్మాణ వేడుకకు అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే సభావేదిక వద్ద గ్యాలరీలన్నీ నిండిపోయాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.