Private Travels Bus Fire: రాష్ట్రంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. ప్రకాశం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/dgp-cv-anand-reviews-the-performance-of-greyhounds-and-octopus/
శుక్రవారం తెల్లవారుజామున ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్ నుంచి పొగ రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కిందకి దించేశాడు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Also Read: https://teluguprabha.net/sports-news/mumbai-indians-beat-punjab-kings-by-6-wickets-ipl-2026/
కాగా, బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచోసుకుందని ప్రయాణికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

