చైర్మన్ అభ్యర్థికి 3 నామినేషన్లు దాఖలు
టీడీపీ 50, వైసీపీ 64, బీజేపీ 3, ఇండిపెండెంట్ లు 10 నామినేషన్ లు
ప్రొద్దుటూరు, (తెలుగు ప్రభ):ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో రెండవ రోజు శనివారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమై అటు అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 62 కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కాగా చైర్మన్గా పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.బీజేపీ మూడు కౌన్సిలర్ అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ 50 కౌన్సిలర్ అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేశారు.
అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా పదిమంది నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఈ నామినేషన్ల ప్రక్రియకు పోలీసులు మూడు అంశాల భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారి కమిషనర్ తూతిక శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వేచ్ఛగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు వారికి కావలసిన ధృవ పత్రాల జారీ లో జాప్యం లేకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

