Homeఆంధ్రప్రదేశ్Proddatur:ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం కల్పించండి

Proddatur:ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం కల్పించండి

ప్రొద్దుటూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా

- Advertisement -

వైసీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డీ నరసింహ రెడ్డి

ప్రొద్దుటూరు,(తెలుగు ప్రభ): ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం కల్పించి మున్సిపల్ చైర్మన్‌గా గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని వైసీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి రెడ్డి ప్రజలను కోరారు. శనివారం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యమిస్తూ, పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

ప్రచార సమయంలో ప్రజలు చూపిన ఆదరణ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌ను ప్రజలే నేరుగా ఎన్నుకునే అవకాశం రావడం సంతోషకరమని పోరెడ్డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అంశాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ తమకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ పాలనలోనే అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో పూజల అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల్లో తనను చైర్మన్‌గా, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలు కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేస్తానని పోరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News