ముంబై నటి కాదంబరి జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు(PSR anjaneyulu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం సీఐడీ అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఆదివారం, సోమవారం కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది.
అయితే ఆంజనేయులకి బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో ఆదివారం విచారణ జరపలేదు. ఈ క్రమంలో కాసేపటి క్రితం జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తాడిగడప సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు.