Pulasa fish :”పులస” కేవలం ఒక చేప కాదు. అది గోదావరి నదికి ఒక ప్రత్యేకమైన వరం. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరికే అత్యంత అరుదైన, రుచికరమైన చేప. సాధారణంగా నదులు, సముద్రాలలో జీవించే చేపలు, గుడ్లు పెట్టడానికి వర్షాకాలంలో గోదావరిలోకి ఎదురీదుతాయి. ఈ ప్రయాణంలో నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదడం వల్ల వాటి శరీరంలో ప్రత్యేకమైన కొవ్వు పేరుకుంటుంది. ఈ కొవ్వు ఆ చేపకు ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
దీనిని తినేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు ఒక చిన్న పులస చేప ధర వేలకు వేలు పలకడం ఆశ్చర్యం కలిగించదు. ఈ ప్రత్యేకమైన రుచి కారణంగానే “పులస చేప”కు ఇంత డిమాండ్ ఉంటుంది. అందుకే గోదావరి జిల్లాల ప్రజలు దీనిని బంగారంతో పోల్చడం ఆశ్చర్యం కాదు. పులస రుచి చూడాలంటే కచ్చితంగా వర్షాకాలం వరకూ ఎదురు చూస్తారు
తింటే గోదావరి చేప తినాలి అంటారు. అందులో వర్షాల సీజన్‌లో పులస చేప కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.వర్షాకాలం ప్రారంభమైంది అంటే గోదావరి జిల్లాల ప్రజలు ఎదురుచూసేది పులస చేపల కోసం. ఈసారి వరద గోదావరి పులస ప్రియులకు పండుగే చేసింది. యానం గోదావరి నదిలో మత్స్యకారుల వలకు రెండు అరుదైన పులస చేపలు చిక్కాయి. చేపల మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో వాటి ధరలు ఆకాశాన్నంటాయి.
Sugali Preethi Case : సుగాలి ప్రీతి కేసును మరోసారి సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
పులస చేపల వేలం
1.5 కేజీల బరువున్న ఒక పులస చేప రూ. 29,000 పలికితే, 1.4 కేజీల బరువున్న మరో పులస రూ. 28,000 పలికింది. పులస చేపలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా దొరుకుతుండటంతో, వాటిని సొంతం చేసుకోవడానికి మాంసప్రియులు వేలకు వేలు వెచ్చించారు. వర్షాకాలంలో నది ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదడం వల్ల పులస చేప శరీరంలో ప్రత్యేకమైన కొవ్వు పేరుకుంటుంది. ఈ కొవ్వు కారణంగానే పులస చేపకు అద్భుతమైన రుచి వస్తుందని, అందుకే దాని ధర ఇంత ఎక్కువగా ఉంటుందని మాంసప్రియులు చెబుతున్నారు.
పండుగప్పకు రికార్డు ధర
పులస తర్వాత అత్యంత ఇష్టపడే పండుగప్ప చేప కూడా ఈసారి రికార్డు ధర పలికింది. యానాంలో గోదావరి, సముద్రం కలిసే సంగమ ప్రాంతంలో మత్స్యకారుల వలకు 20.300 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. దీనిని వేలంపాటలో రూ. 16,000 లకు ఫ్రాన్సుతిప్పకు చెందిన పెమ్మాడి వెంకటేష్ కొనుగోలు చేశారు. పులస చేపల మాదిరిగానే, పండుగప్పలో కూడా ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ స్థాయిలో భారీ చేప దొరకడం ఇదే తొలిసారి అని మత్స్యకారులు తెలిపారు. పులస, పండుగప్ప చేపల రాకతో చేపల ప్రియుల ఆనందానికి అవధులు లేవు.


