ZPTC Polling: వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, అప్పటి వరకు క్యూలో ఉన్నవారికి ఓటేయటానికి అధికారులు అనుమతి ఇచ్చారు.
ఈ రెండు స్థానాల్లో ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధానంగా రాజకీయ సమరాన్ని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మద్యే కొనసాగింది.
పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ తరపున మారెడ్డి లతారెడ్డి, వైకాపా తరపున హేమంత్ రెడ్డి పోటీలో నిలిచారు. అదే విధంగా ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి, వైసీపీ తరపున ఇరగం రెడ్డికి మధ్య ప్రధాన పోరు సాగింది. పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టు సమాచారం.


