సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కి ఓటుతో బుద్ది చెప్పాలనీ పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పుట్టపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వ అరాచకాలకు ఓటుతో సమాధానం చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో పుట్టపర్తి గడ్డపై ఎలాంటి అవినీతికి తావు లేకుండా సేవ చేస్తానని మాట ఇచ్చారు. భవిష్యత్తులో నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని పేర్కొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సొంత మండలాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. స్వంత స్వలాభం కోసమే పనిచేశారు కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయలేదని పేర్కొన్నారు. ఈలాంటి ఎమ్మెల్యే మళ్ళీ పుట్టపర్తి నియోజకవర్గానికి గెలిపిస్తే పుట్టపర్తిని పూర్తిగా అమ్మెస్తాడని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అందుకే టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీని భాజీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.