ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్(Sunil Kumar)కు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన సస్పెన్షన్‌ను మరో 4 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆగస్టు 28 వరకు సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
కాగా వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్‌కుమార్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా విదేశాల్లో పర్యటించారు. జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని యూఏఈ వెళ్లారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొంది యూకేలో పర్యటించారు. 2019 డిసెంబరు నుంచి 2024 మార్చి మధ్య మొత్తం ఆరుసార్లు విదేశాల్లో పర్యటించినట్లు కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగంపై ఆయన్ను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.