తీరం దాటిన వాయుగుండం
తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో తీరం దాటిన వాయుగుండం
చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటిన వాయుగుండం
క్రమంగా బలహీనపడనున్న వాయుగుండం
రాగల 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలహీనపడుతుంది
ఇవాళ దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
(ఐఎండి బులెటిన్ 2:30AM, సమాచారం ప్రకారం)
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
చెన్నైకి 80 కి.మీ., నెల్లూరుకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతం
పశ్చిమ వాయువ్య దిశగా 22 కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం
తరువాత క్రమంగా బలహీనపడనున్న వాయుగుండం
ఇవాళ దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు,
మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
~ రోణంకి కూర్మనాథ్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ