Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Rain alert: రానున్న 5 రోజులు వర్షాలు

Rain alert: రానున్న 5 రోజులు వర్షాలు

రానున్న 5 రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

- Advertisement -

రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

శనివారం సాయంత్రం 7 గంటల నాటికి ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో 36మిమీ,నెల్లూరు జిల్లా దుత్తలూరులో 32.7మిమీ, వరికుంటపాడు 28.5మిమీ, అనంతపురం జిల్లా యాడికిలో 26మిమీ
చొప్పున వర్షపాతం నమోదైందన్నారు

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా వరకు విస్తరించాయని, అలాగే మరఠ్వాడా ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

వీటి ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు,పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం జిల్లా కొండపిలో 19మిమీ,అనంతపురం జిల్లా బికె సముద్రంలో 15.5మిమీ, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, సంజామలలో14మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News