Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Rain alert: ఏపీలో వర్షాలు

Rain alert: ఏపీలో వర్షాలు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన తాజా అప్డేట్ ప్రకారం శనివారం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండి అంచనా ప్రకారం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం (22-04-2023) ఉత్తరాంధ్ర,రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం (23-04-2023) ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News