Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Rain alert: ఈరోజు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే

Rain alert: ఈరోజు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే

కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతున్న కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా. బిఆర్ అంబేద్కర్, ఎండి,ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

“పిడుగులు” పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు

-డా. బిఆర్ అంబేద్కర్, ఎండి,ఏపీ విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News