Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Rains: ఈ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు

Rains: ఈ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పులు కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం కలిగించనున్నట్లు కనిపిస్తోంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, మరియు రాయలసీమ జిల్లాలపై స్పష్టంగా ఉండనుంది.

- Advertisement -

ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఆగస్టు 4వ తేదీ (సోమవారం) మరియు ఆగస్టు 5వ తేదీ (మంగళవారం) తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలోనూ ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో వర్ష సూచనలు పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉండే అవకాశం ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి.

గత 24 గంటల్లో నారాయణపేట జిల్లా మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ., కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 2.74 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు ఈ ఏడాది వర్షాకాలం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు లేకపోవడం గమనార్హం. నైరుతి రుతుపవనాలు ప్రధానంగా ఉత్తర భారతదేశం మీద దృష్టి సారించడంతో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అలాగే, రుతుపవనాల్లో తేమ తగ్గిపోవడం కూడా వర్షాభావానికి కారణంగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad