Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: రజకులకు రాజ్యాంగములోని హక్కులు కల్పించాలి

Yuvagalam: రజకులకు రాజ్యాంగములోని హక్కులు కల్పించాలి

మా సామాజికవర్గానికి అన్యాయం చేస్తున్నారు

రాష్ట్రంలో రజకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ హక్కులు కల్పించాలని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు కోరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో జరిగిన యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం నంద్యాలలో ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో భారత రాజ్యాంగ నిర్మాత రచించిన రాజ్యాంగ హక్కులను కల్పించాలని కోరారు. తరతరాల నుండి రజక సామాజిక వర్గానికి రాజకీయాయ పార్టీలు తీరని ద్రోహం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. నంద్యాల జిల్లా పరిధిలోని కరిమద్దెల, నట్ల కొత్తూరు, దాడులు, గ్రామ బహిష్కరణలు జరిగినప్పటికీ పాలకులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, బీసీలలో మూడు సామాజిక వర్గాలకు మాత్రమే రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు కానీ ఇప్పటి వరకు, రాష్ట్రంలో రజకులకు కనీసం 5%శాతం కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, మండలి చైర్మన్, కౌన్సిలర్,సర్పంచులు షీట్లు ఎందుకు కేటాయించ లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం పనికిరాని రజక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, గడిచిన మూడు సంత్సరాల కాలంలో ఒక్క రూపాయి నిధులను కేటాయించకుండా రజకులను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలో వున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గాని, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలు గాని రజకులకు ఎన్నికలలో ఓట్ల కోసం ఎంగిలి మెతుకులు విసిరివేసినట్లుగా క్వాటర్ సీసాలు, బిర్యానీకి పరిమితం చేయడమే కాకుండా మీకు ఇస్త్రీ పెట్టెలు, దోభీ ఘాట్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చినా తరువాత ” ఏటి అవతల యంగన్న, ఏటి ఇవతల పింగన్న ” అన్న సామెతగా రాజకీయ పార్టీలు వ్యవరిస్తున్న తీరును చూస్తుంటే నియంత పాలనను కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అయిన విద్యా, ఉద్యోగ, రాజకీయ,ఆర్థిక రంగాలలో రజకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగములోని హక్కులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు కిరణ్ కుమార్ రజక, రత్నమయ్య, ఆంజనేయులు, యన్. శ్రీనివాసులు,కొత్తపల్లె నారాయణ, పుల్లయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News