Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్TDP: టీడీపీకి బిగ్‌ షాక్‌.. సీనియర్ నేత రాజీనామా

TDP: టీడీపీకి బిగ్‌ షాక్‌.. సీనియర్ నేత రాజీనామా

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి(TDP) బిగ్ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీకే ఓ సీనియర్ నేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం(Sugavasi Balasubramanyam) టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు పంపారు. “ప్రజల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి బాలసుబ్రమణ్యం ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని ఆరోపించారు. తమకు పార్టీ ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యం అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాయచోటి నుండి పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఏ పార్టీ మద్దతు ఉన్నా లేకున్నా పోటీ చేస్తామన్నారు. కాగా బాలసుబ్రమణ్యం తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు టీడీపీ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News