Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్Rajinikanth: దివంగత జయలలితకి రజనీకాంత్ నివాళులు

Rajinikanth: దివంగత జయలలితకి రజనీకాంత్ నివాళులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత(Jayalalitha) 77వ జయంతి సందర్భంగా చెన్నైలోని పోయస్ గార్డెన్‌లోని ఆమె నివాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) వెళ్లారు. ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత మేనకోడలు, మేనల్లుడితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

సినీ పరిశ్రమలో జయలలితతో నటించే అవకాశం తనకు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన జయలలిత భౌతికంగా లేకపోయినా… ఆమె అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. అమ్మగా ఆమె కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News