Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Rajinikanth : శ్రీవారి సేవలో సూపర్ స్టార్.. ఏఆర్ రెహమాన్ తో కలిసి కడపకు

Rajinikanth : శ్రీవారి సేవలో సూపర్ స్టార్.. ఏఆర్ రెహమాన్ తో కలిసి కడపకు

తమిళ అగ్రనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమలకు విచ్చేశారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన పండితులు వేదఆశీర్వచనం చేశారు. బుధవారం (14న) సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలసి రజనీకాంత్ తిరుమలకు వచ్చారు. గురువారం ఉదయం ప్రత్యేక క్యూలైన్లో వారిద్దరూ శ్రీవారి దర్శనం చేసుకునేలా తగు ఏర్పాట్లు చేశారు. దర్శనం చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చాక.. అభిమానులకు రజనికాంత్ అభివాదం చేశారు.

- Advertisement -

అక్కడి నుండి నేరుగా కడపలోని అమీన్ పీర్ దర్గాకు పయనమయ్యారు. దర్గా దర్శనానికి ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో త్వరలోనే లాల్ సలామ్ అనే సినిమా ప్రారంభం కానున్న నేపథ్యంలోనే.. ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News