Raksha Bandhan: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే ఓ గుడి కథ ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. యాక్సిడెంట్ లో చనిపోయిన తన చెల్లెలిని మరిచిపోలేని ఓ అన్నయ్య ఆమె గుర్తుగా గుడి కట్టటమేకాకుండా నిత్యం పూజలు సైతం చేస్తున్నాడు.
నెల్లూరు జిల్లా కాకుటూరులో రాఖీ పండుగు సందర్భంగా ఓ విషాద గాథ ప్రతీ ఒక్కరిని కలిచివేస్తోంది. శివప్రసాద్ అనే అన్నయ్య తన చెల్లెలిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. అయితే 2011లో వారిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లెలు సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. అదృష్టవశాత్తూ శివప్రసాద్ బతికాడు కానీ చెల్లెలి మరణాన్ని తట్టుకోలేకపోయాడు.
ALSO READ : Mega DSC 2025 : మెగా డీఎస్సీ 2025 ఫైనల్ ఆన్సర్ కీలో తప్పులు.. నిరుద్యోగుల ఆందోళన
ఆమె జ్ఞాపకార్థం శివప్రసాద్ ఓ గుడిని నిర్మించారు. ఆ గుడిలో చెల్లెలి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ ఆలయం ఇప్పుడు గ్రామస్థులందరికీ ఆధ్యాత్మికత, ప్రేమబంధానికి చిహ్నంగా నిలిచింది. రాఖీ పౌర్ణమి సమయంలో ఈ కథ మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఈ సంఘటన అన్న చెల్లెళ్ల అనుబంధం విలువను గుర్తు చేస్తుంది. అన్నా చెల్లెల్లు అంటే కేవలం రక్తసంబంధీకులే కాదు, జీవితాన్ని ఆనందంతో నింపే అమూల్యమైన అనుబంధం. ఈ గుడి, ప్రేమ, త్యాగం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచి, అందరినీ ఆలోచింపజేస్తోంది.
ALSO READ : AP Rains: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!


