ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Cm Pawan Kalyan) ముస్లిం సోదర, సోదరీమణులందరీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. ఖురాన్ అవతరించిన పవిత్ర మాసం ఇది. ఉపవాస దీక్షలు ముగించి ఈదుల్ ఫితర్ వేడుకకు సన్నద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
వైయస్ జగన్
భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ (Ramadan)పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
Ramadan Greeting: ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం పవన్, వైయస్. జగన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES