Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Ramathirtham: ప్రభుత్వం తరపున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన బొత్స

Ramathirtham: ప్రభుత్వం తరపున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన బొత్స

రామతీర్ధంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు స్వామి వారి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. గోటితో వొలిచిన 28 కేజీల తలంబ్రాలను కల్యాణానికి వినియోగించారు.  టిటిడి నుండి, సింహాచలం నుండి విచ్చేసిన వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం వైభోగంగా జరిగింది.

- Advertisement -

ప్రముఖ పండితులు మైలవరపు శ్రీనివాస రావు వ్యాఖ్యానం ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచింది. ఈ  కల్యాణోత్సవంలో మంత్రి  బొత్స సత్యనారాయణ  దంపతులు, వారి కుటుంబ సభ్యులు, నెలిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు దంపతులు, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, ఎం.ఎల్.సి డా.సురేష్ బాబు  పాల్గొన్నారు. తొలుత జె.సి. మయూర్ అశోక్,  ఆర్.డి.ఓ  సూర్య కళ, దేవస్థానం ఈ.ఓ కిశోర్ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదం మంత్రాలతో  మంత్రివర్యులు, శాసన సభ్యులను , జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తిని దేవాలయంలో సీతారాముల దర్శనానికి తీసుకెళ్ళారు. అనంతరం కల్యాణ వేదిక వద్ద జరిగిన వేడుకలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News