Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Ramayya: నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు

Ramayya: నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు

పేదింటి పిల్లల భవిష్యత్తును సిఎం బాధ్యతగా తీసుకున్నారు

పేద పిల్లలు చదువుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చక్కటి అవకాశాలను కల్పిస్తున్నారని, వాటిని అందిపుచ్చుకుని పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నగర మేయర్ బి.వై. రామయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డు గణేష్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అంతకన్నా ముందు నాడు-నేడు కింద రూ.15 లక్షలతో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చదువుకు దూరమైన పిల్లలకు అమ్మ ఒడి వంటి పథకాలతో ముఖ్యమంత్రి ప్రోత్సాహిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు తీర్చిదిద్దుతున్నారన్నారు. సిబిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, ఆరో తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ వంటి విప్లవాత్మక మార్పులతో రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేశారన్నారు. పేద పిల్లల భవిష్యత్తును వైయస్ జగన్ తన బాధ్యతగా తీసుకుని వారికి అత్యున్నత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు కుమార్ రెడ్డి, సిబ్బంది అనిల్ కుమార్, రిత ప్రియాంక, నాయకులు కనికే శివరాం, ఎస్.కే. యూనూస్, దేవుపూజ ధనుంజయ ఆచారి, మాదాసు నాగరాజు, శ్రీనివాస యాదవ్, చిన్న, లక్ష్మిపతి, తిరుపాలు, సంతోష్, రాజేష్, కిరణ్, మహిళలు సుభాషిణి, వేదవతి, నిర్మల, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, మేస్త్రి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News