2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు(Rammohan Naidu) తెలిపారు. ఇప్పటివరకు విమానాశ్రయం పనులు 71శాతం పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల్లో పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు.
- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే అతి అధునాతనమైనదని చెప్పారు. ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళానిలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
