Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Roja: ఏ క్షణమైనా మాజీ మంత్రి రోజా అరెస్ట్: టీడీపీ నేత

Roja: ఏ క్షణమైనా మాజీ మంత్రి రోజా అరెస్ట్: టీడీపీ నేత

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా(ROJA) త్వరలోనే అరెస్ట్ కావడం పక్కా అని టీడీపీ యువ నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. క్రీడా సామగ్రి కొనుగోళ్లలో రూ. 119 కోట్లకు పైగా నిధులను పక్కదోవ పట్టించారని పేర్కొన్నారు. అలాగే తిరుమల దర్శనం టికెట్ల దందాలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని.. దానిపైనా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇక టూరిజం శాఖతో పాటు నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

- Advertisement -

విచారణలో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రోజా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పక్కా ఆధారాలతో ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేయవచ్చని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ భయంతో నెల రోజులు ఎక్కడో దాక్కున్నారని.. కానీ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడితో తిరిగొచ్చి తూతూమంత్రంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై బురదజల్లారని విమర్శించారు. ప్రెస్‌ మీట్‌ అంతా ఆమె భయంతోనే మాట్లాడారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News