దశాబ్దాకాలంగా పెండింగ్ లో ఉన్న రాజోలి బండ డైవర్షన్స్ స్కీమ్ (RDS) కుడి కాలువ నిర్మాణాన్ని పూర్తిచేసి 40,000 ఎకరాలకు సాగునీరు అందించి మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో వలసలు నివారించాలని కోరుతూ సిపిఐ గోనెగండ్ల మండల సమితి ఆధ్వర్యంలో గోనెగండ్ల బస్టాండ్ లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్, జి రంగన్న, గోనెగండ్ల సిపిఐ మండల కార్యదర్శి నాగప్పల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది.
ఈ సందర్భంగా మంత్రాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలనీ, ఆలాంటి ప్రాంతాలలో నిత్యం కరువు, వలసలు తాండవం చేస్తున్నాయని, కరువు కాటకాలకు నిలయంగా ఉన్న మంత్రాలయం నియోజవర్గంలో 4 టిఎంసిల ఉపయోగం గల ఆర్డీఎస్ కుడికాలు నిర్మాణ పనులు పూర్తిచేస్తే మంత్రాలయం, ఎమ్మిగనూర్,కోడుమూరు నియోజకవర్గాలకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే కల్పవల్లి ఆర్డీఎస్ అని వారు తెలిపారు. గత తెలుగుదేశ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కుడికలో నిర్మాణానికి రూ 1985.42 కోట్ల రూపాయలతో అంచన వ్యయంతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ అప్పగించారని.. సుమారు 13 కోట్ల విలువైన పనులు జరిగాయన్నారు. ఆ పనులకు వైసీపీ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని దీంతో వారు పనులు నిలుపుదల చేసి అర్ధాంతరంగా వెళ్లిపోయారన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరియాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, భూసేకరణ ప్రాజెక్టు నిర్మాణం కొరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయకపోవడం దారుణమని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కి సాగునీరు ప్రాజెక్టుల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని కేవలం మా ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అంటూ మాయమాటలతో రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని వారు తెలిపారు. మంత్రాలయం నుండి కర్నూల్ వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు గతంలో సర్వేలు పూర్తి చేసినప్పటికీ పార్లమెంట్ సభ్యుల చేతగానితనంతో రైల్వే లైన్ కలగానే మిగిలిపోయిందని, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ నాలుగేళ్ల కాలంలో ఎక్కడ ఆయన ఆచూకీ కనపడటం లేదని, ఈసారైనా పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే లైన్ పై గళం ఎత్తి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మంత్రాలయం నుండి కర్నూల్ వరకు రైల్వే లైన్ పూర్తిచేయాలని వారు తెలిపారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 25 వేల మంది చేనేత కార్మికులు జీవనం గడుపుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయకపోవడం దారుణమని కాబట్టి ఈ మూడు అంశాలపై దశలవారీగా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి వీటి సాధనకు శ్రీకారం చుడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జయరాం, షాలు, సుధాకర్, గిడ్డయ్య, పాండు, వీరేష్, బజారి పాల్గొన్నారు.