Tuesday, December 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం

Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం

Kurnool| కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌(‌Highcourt Bench) ఏర్పాటు చేసేందుకు శాసనసభ(AP Assembly)లో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టంది. మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

కాగా కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా డిమాండ్‌ ఉంది. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల బెంచ్ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఆయన సీఎం హోదాలో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News