Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Electricity Bill: రూ.15 లక్షల బిల్లు.. మాస్టర్‌కు కరెంట్ షాక్ కొట్టింది

Electricity Bill: రూ.15 లక్షల బిల్లు.. మాస్టర్‌కు కరెంట్ షాక్ కొట్టింది

Retired Teacher Got Rs. 15 Lakhs Electricity Bill: సామాన్యులకు వేలల్లో రావాల్సిన కరెంట్ బిల్లు లక్షల్లో వస్తే ఇంకేమైనా ఉందా..? లబోదిబోమనాల్సిందే. ఇటీవల కాలంలో కరెంట్ బిల్లులు లక్షల్లో రావడం దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. రీడింగ్ మీటర్‌లో సాంకేతిక సమస్యల కారణంగానే బిల్లులు అధికంగా వస్తాయని అధికారులు చెబుతూ ఉంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనే తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రిటైర్డ్ మాస్టర్ ఇంటికి ఏకంగా 15 లక్షల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఆ మాస్టర్‌కు నిజంగానే కరెంట్ షాక్ కొట్టినంత పని అయింది. ఇదేందరా బాబూ తన ఇంటికి అన్ని లక్షల కరెంట్ బిల్లు రావడమని ఆయన లబోదిబోమంటున్నారు.

- Advertisement -

సాధారణంగా కరెంట్ బిల్లు మహా అయితే రూ.2వేల నుంచి రూ.5వేల లోపు వస్తుంది. అది కూడా ఏసీలు, ఫ్యాన్లు వినియోగం ఎక్కువగా వాడుతుంటే. అదే పేదింటి వారికి మాత్రం వందల్లోనే బిల్లు వస్తుంది. మరి ధనవంతులు అయితే రూ.10వేల లోపు కరెంట్ బిల్లు రావచ్చు. కానీ లక్షల్లో కరెంట్ బిల్లు వస్తే ఇంకేమైనా ఉందా.. గుండె ఆగినంత పని అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మామిడికుదురు మండలానికి చెందిన నన్నేషా హుస్సేన్ అనే వ్యక్తి హెడ్ మాస్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఇటీవల లైన్‌మెన్ జులై నెల కరెంట్ బిల్లు తీసి ఇచ్చారు. అంతే ఆ బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ప్రతి నెలా రూ.1300-రూ.1500 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు ఏకంగా రూ.15,14,993 వచ్చింది. దీంతో లక్షల్లో బిల్లు ఎలా కట్టాలంటూ వాపోతున్నారు.ఎలక్ట్రిసిటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఏపీ పోలీసులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
కాగా ప్రభుత్వం డిజిటల్ మీటర్లు ఏర్పాటుచేసిన నాటి నుంచి సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం అధికమైంది. ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో సామాన్యులు కరెంట్ బిల్లుల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మరి ప్రభుత్వం డిజిటల్ మీటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad