Friday, November 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Accident: అనంతపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Accident: అనంతపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Accident| అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం- కడప జాతీయ రహదారిపై నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు వేగంగా ఢీకొట్టింది.టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తాడిపత్రిలో జరిగిన నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కి చెందిన భక్తులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో శ్రీధర్ (28), సంతోష్ (26),వెంకన్న (35), ప్రసన్న (34), వెంకీ (24), షణ్ముఖ (30) ఉన్నారు.

- Advertisement -

కాగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అతి వేగం, నిద్రలేమి కారణంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమదాలు జరగకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని.. వేగంగా కుండా నిదానంగా డ్రైవ్ చేయాలని ఎన్నిసార్లు సూచించినా ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీని కారణంగా మృతుల కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News