కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. సి.కె.దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద మలుపు వద్ద కారుపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES