Homeఆంధ్రప్రదేశ్Kakinada: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌!

Kakinada: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌!

Kakinada Road Accident: కాకినాడలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలి పనులకు వెళ్తున్న వారిపైకి టిప్పర్ లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదం: స్థానిక వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనుల కోసం కొందరు కూలీలు బయలుదేరారు. అయితే వారు కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వారిని బలంగా ఢీకొట్టింది. టిప్పర్ వేగానికి కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు.

Also read-Kukatpally: మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి.. నిలదీస్తే ఎదురుదాడి!

నలుగురు అక్కడికక్కడే మృతి: ఈ ప్రమాద తీవ్రతకు నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News