అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడి దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
చోడవరం మండలం గోవాడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. బీఎన్ రోడ్డు సమీపంలోని సుజాత అనే మహిళ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి 65 తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దోపిడీకి గురైన మొత్తం సొత్తు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

