Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: రూ.250 పెరిగిన పింఛన్.. కానీ ఉంటుందా ఉండదా భయం!

AP Govt: రూ.250 పెరిగిన పింఛన్.. కానీ ఉంటుందా ఉండదా భయం!

- Advertisement -

AP Govt: ఏపీలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. కేబినెట్ నిర్ణయం ఇప్పుడిస్తున్న పెన్షన్‌పై రూ.250 పెరగనుంది. ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది. పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం ఇది అందించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు అమల్లోకి రానుంది.

అయితే, పెన్షన్లు పెరుగుతున్నాయన్న ఆనందం ఉండాల్సిన వృద్ధులలో మాత్రం ఆ ఆనందం కనిపించడం లేదు. అసలు వచ్చే నెలలో మా పెన్షన్ ఉంటుందా ఉండదా అని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలలో ఆందోళన నెలకొంది. దీనికి కారణం ఏపీలో వచ్చే నెల నుండి సుమారు రూ.50 వేల పింఛన్లు తొలగించనున్నారని ప్రచారం జరగడమే. ఇప్పటికే ఈ 50 వేల మందికి గ్రామ, వార్డు వాలంటీర్లు ఎవరి పెన్షన్లు తొలగించాలని అనుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారట.

ఇప్పటి వ‌ర‌కు పింఛన్ల మంజురూలో ఎలాంటి నిబంధ‌న‌లు లేవు. కానీ, ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నవాళ్లు, 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరి పెన్షన్ కట్ చేస్తున్నారో వాళ్ళకి వాలంటీర్లు నోటీసులు కూడా ఇస్తున్నారట. 15 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొంటున్నారట.

దీంతో వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలలో ఆందోళన మొదలైంది. వచ్చే నెలలో తన పెన్షన్ వస్తుందా లేక సాకులు చెప్పి కట్ చేస్తారా అన్న అనుమానాలతో సతమతమవుతున్నారు. కొత్త సంవత్సరంలో పెన్షన్ పెంపు శుభవార్త వింటామా.. పెన్షన్ కట్ అనే చేదువార్త వింటామా అని చర్చించుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల తొలగింపు చేపడితే అది ప్రతిపక్షాలకు ఆయుధం కానుండగా.. ప్రభుత్వానికి కొత్త చిక్కులు తేవడం ఖాయం. మరి తొలగింపుకు ముందుకు వెళ్తారా లేక వెనక్కు తగ్గుతారా చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News