రాజ్యసభ సభ్యత్వానికి రెండవ సెట్ నామినేషన్లు దాఖలు చేసిన వైసిపి అభ్యర్థులు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసిపి సభ్యులు గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద మరోక సెట్ వంతున తెలిపిన ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితా రాణి తదితరులు పాల్గొన్నారు.

