Homeఆంధ్రప్రదేశ్Attack on RTC Bus: గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

Attack on RTC Bus: గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

గురజాల, అక్టోబర్ 4 (తెలుగు ప్రభ): పల్నాడు జిల్లా గురజాలలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపలేదనే కోపంతో మహిళ ప్రయాణికురాలి బంధువులు, కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మాచర్ల డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు గుంటూరుకు వెళ్తుండగా మాడుగుల వద్ద చోటుచేసుకుంది.

- Advertisement -

ఓ మహిళ మాచర్ల నుంచి గుంటూరుకు వెళ్లే బస్సు ఎక్కింది. అయితే ఆమె కోరిన చోట బస్సును ఆపకుండా కొంత ముందుకు తీసుకెళ్లి డ్రైవర్ ఆపాడు. దీంతో ఆగ్రహించిన మహిళ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు బంధువులతో మాడుగుల వద్దకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బస్సును నిలిపివేశారు. వాటిని తొలగించేందుకు దిగిన కండక్టర్ పై కోడిగుడ్లు, కర్రలతో దాడికి యత్నించినట్లు సమాచారం. అడ్డుకునేందుకు వెళ్లిన డ్రైవర్‌, కొంత మంది ప్రయాణికులపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గురజాల పోలీసులకు ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News