రుద్రవరం మండల తహశిల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ తహశిల్దార్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ తహశిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటశివ గత రెండు నెలల క్రితం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లడంతో కార్యాలయానికి రెగ్యులర్ తహశిల్దార్ ను నియమించకపోగా ఆళ్లగడ్డ తహశిల్దార్ హరినాధరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఆళ్లగడ్డలోని విధులు నిర్వహిస్తూ రుద్రవరం కార్యాలయానికి రాకపోవడంతో పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న ప్రజలు రైతులు విద్యార్థులు కార్యాలయంలో పనులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఆయా గ్రామాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న విఆర్వోలు గ్రామాలలో పనులు ముగించుకుని అట్నుంచి అటే ఆళ్లగడ్డ తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా ఉన్నతాధికారులు రుద్రవరం మండలానికి రెగ్యులర్ తహసిల్దార్ని నియమించాలని ఆయా గ్రామాల ప్రజల కోరుతున్నారు.
Rudravaram: రెగ్యులర్ తహశిల్దార్ లేక ఇబ్బందుల్లో ప్రజలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES