Sunday, November 10, 2024
Homeఆంధ్రప్రదేశ్Rudravaram: తహశిల్దార్ గా రావాలంటే జంకుతున్న అధికారులు!

Rudravaram: తహశిల్దార్ గా రావాలంటే జంకుతున్న అధికారులు!

నువ్వు వెళ్ళు అంటే నువ్వే వెళ్ళు అని ఇద్దరు డిప్యూటీ తహశిల్దార్ల మధ్య జరుగుతున్న చర్చ

రుద్రవరం మండలంలో ఒకవైపు భూ సమస్యలు మరోవైపు విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల తరలింపుతో రుద్రవరం మండలంలో తహశిల్దార్ గా బాధ్యతలు నిర్వర్తించాలంటే రెవెన్యూ అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రుద్రవరం మండలంలో తహశిల్దార్ గా విధులు నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపేందుకు సంశయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రుద్రవరం మండలం తహశిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటశివ గత ఐదు నెలల క్రితం (జనవరి నెలలో) పదోన్నతిపై వెళ్లారు. దీంతో ఆళ్లగడ్డ తహశిల్దార్ హరినాధరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. మండలంలో రైతులకు సంబంధించిన భూ సమస్యలు ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఇద్దరు డిప్యూటీ తహశిల్దార్ లో ఒకరిని రుద్రవరం తహశిల్దారిగా నియమించినట్లు విశ్వసనీయ సమాచారం.

- Advertisement -

అయితే అసలు చిక్కంతా ఇక్కడే ఉంది మండలంలో అధికమైన భూ సమస్యలు విచ్చలవిడి అక్రమ మట్టి మాఫియాతో ఇక్కడికి రావాలంటే రెవెన్యూ అధికారులు జంకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు డిప్యూటీ తహశిల్దార్లలో నువ్వు వెళ్ళు అంటే నువ్వే వెళ్ళు అని ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు రెవిన్యూ వర్గాల సమాచారం. ఇంతకీ ఇద్దరు డిప్యూటీ తహశిల్దార్లలో ఎవరు రుద్రవరం తహశిల్దార్ గా బాధ్యతలు చేపడతారన్న ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు ఓ డిప్యూటీ తహశిల్దార్ను బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎట్టకేలకు ఒకటి రెండు రోజుల్లో రుద్రవరం మండల తహశిల్దారుగా జిల్లా కలెక్టర్ ఆదేశించిన రెవెన్యూ అధికారి మాత్రం బాధ్యతలు చేపట్టక తప్పదన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News