Homeఆంధ్రప్రదేశ్Mega DSC: మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం.. యువత తిరగబడాలి- శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు

Mega DSC: మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం.. యువత తిరగబడాలి- శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు

MEGA DSC SAAP Ravi Naidu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని క్రీడా శాఖ SAAP ఛైర్మన్‌ రవినాయుడు ఆరోపించారు. నిరుద్యోగ యువత వాటిని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. తిరుపతిలో కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయ అభ్యర్థులతో నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/five-people-missing-in-tungabhadra-river-at-mantralayam/

భవిష్యత్తుతో ఆడుకోవద్దు: గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించారనే కక్షతోనే, నిరుద్యోగ యువతపై ప్రతికారేచ్ఛతో వ్యవహరిస్తోందని రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ కోటా కింద నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆనందంలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్న వైసీపీ కుట్రలకు వ్యతిరేకంగా యువత తిరగబడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నిరుద్యోగులు తదుపరి రాబోయే మరో మెగా డీఎస్సీకి సిద్ధం కావాలని స్పష్టం చేశారు. 

Also Read: https://teluguprabha.net/top-stories/dk-shivakumar-unanimously-elected-as-karnataka-clp-leader/

వైసీపీ ఆరోపణలు: డీఎస్సీ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలకు అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ డీఎస్సీ ప్రక్రియలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రవినాయుడు స్పందించారు. ప్రతిపక్ష పార్టీ కేవలం రాజకీయ స్వార్థంతోనే నిరుద్యోగుల్లో అయోమయం సృష్టిస్తోందని కౌంటర్‌ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News