Monday, March 9, 2026
Homeఆంధ్రప్రదేశ్AP Chief Secretary: ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్‌

AP Chief Secretary: ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్‌

AP CS Sai Prasad: ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ విరమణ చేయడంతో, ప్రభుత్వం ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి సాయిప్రసాద్‌ను నియమించింది. ఈ మేరకు గత ఏడాది నవంబరు 29నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌.. శనివారం ఉదయం 11:33 గంటలకు వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

కీలక పదవుల్లో అపార అనుభవం: ఉమ్మడి ఏపీ నుంచి విభజన అనంతర ఏపీ వరకు సాయిప్రసాద్‌ వివిధ కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. 2024 జూన్‌ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా, 2025 జనవరి నుంచి సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ప్రభుత్వం ఆయనకే బాధ్యతలు అప్పగించింది.

Also read-Konaseema: కోనసీమలో తెలుగు పండగ.. నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు!

2019-24 మధ్య కాలంలో ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ సీఎండీగా, ఇంధన శాఖ ఎక్స్‌ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్‌ఏ (CCLA) గా పనిచేశారు. పాలనా వ్యవహారాల్లో మంచి పట్టున్న అధికారిగా పేరున్న సాయిప్రసాద్‌ రాకతో.. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు మరియు అభివృద్ధి పనుల్లో మరింత వేగం పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News